ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్సకు ‘ఇటోలిజుమాబ్‌’ వద్దు

ABN, First Publish Date - 2020-07-27T08:05:10+05:30

కరోనా చికిత్సకు బయోకాన్‌ కంపెనీకి చెందిన సోరియాసిస్‌ ఔషధం ‘ఇటోలిజుమాబ్‌’ను వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌


న్యూఢిల్లీ, జూలై 26 : కరోనా చికిత్సకు బయోకాన్‌ కంపెనీకి చెందిన సోరియాసిస్‌ ఔషధం ‘ఇటోలిజుమాబ్‌’ను వినియోగించకూడదని ‘కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌’ నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌లోని మెజారిటీ సభ్యులు కొవిడ్‌ ఔషధాల జాబితాలో ఇటోలిజుమాబ్‌ను చేర్చడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కరోనా ఇన్ఫెక్షన్‌ను తగ్గించేందుకు అది ఉపయోగపడుతుందనే ఆధారాలు పెద్దగా లేవని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర ప్రాతిపదికన కరోనా చికిత్సకు వాడదగిన ఔషధాల జాబితా నుంచి ఇటోలిజుమాబ్‌ను తొలగించినట్లేనని అధికార వర్గాలు అంటున్నాయి. మోస్తరు, తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన కరోనా రోగుల్లో ‘సైటోకైన్‌ స్టార్మ్‌ సిండ్రోమ్‌’ కట్టడికి ఈ మందును వాడవచ్చంటూ ఇటీవల డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. తాజాగా ‘కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌’ నిర్ణయంతో ఆ ఆదేశాల అమలుకు బ్రేక్‌ పడనుంది.

Updated Date - 2020-07-27T08:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising