ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం

ABN, First Publish Date - 2020-04-02T14:08:53+05:30

షెన్‌జెన్ నగరంలో మొట్టమొదటిసారి కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షెన్‌జెన్ (చైనా): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చైనా దేశంలోని షెన్‌జెన్  నగరం మొట్టమొదటిసారి కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించింది. మే 1వతేదీ నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం పిల్లులు, కుక్కలతోపాటు పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులను తినడాన్ని నిషేధించారు. పాములు, బల్లులు, కుక్కలు, పిల్లులతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగాన్ని షెన్‌జెన్ నగరంలో నిషేధించారు.


అభివృద్ధి చెందిన తైవాన్, హాంకాంగ్ దేశాల్లో కుక్కలు, పిల్లులను తినడాన్ని నిషేధించారు. చైనాలోని వూహాన్ నగరంలో జంతువధశాల కేంద్రంగా కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో షెన్‌జెన్ నగరం కుక్కలు, పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది. కాగా ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్దలను ఈ నిషేధం నుంచి మినహాయించారు. 

Updated Date - 2020-04-02T14:08:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising