ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా కలకలం... అరగంటపాటు ట్రైన్ నిలిపివేసి...

ABN, First Publish Date - 2020-03-16T13:25:04+05:30

హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా వైరస్ వదంతులు వ్యాపించిన నేపధ్యంలో కలకలం చెలరేగింది. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా వైరస్ వదంతులు వ్యాపించిన నేపధ్యంలో కలకలం చెలరేగింది. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఎ-5 కోచ్‌లో సీటు నంబరు 8, 10లలో ఇద్దరు రష్యా పౌరులు ప్రయాణిస్తున్నారు. కొంతమంది తోటి ప్రయాణికులు వారిని కరోనా బాధితులుగా అనుమానిస్తూ, హంగామా చేశారు. దీంతో ఆ రైలు పట్నా స్టేషన్‌లో 30 నిముషాల పాటు నిలిచిపోయింది. కాగా రైలులో కరోనా బాధితులున్నారన్న వార్త తెలియగానే మెడికల్ టీమ్ వారి వద్దకు చేరుకుంది. వెంటనే వారికి వైద్య పరీక్షలు నిర్వహించడగా, ఎటువంటి వ్యాధులు లేవని నిర్థారణ అయ్యింది. దీంతో రైలు ముందుకు కదిలింది. ఈ సందర్భంగా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ రైలులోని ప్రయాణికులు రష్యా పౌరులను చూసి, వారిని కరోనా బాధితులుగా భావించారని, అయితే వైద్య పరీక్షల అనంతరం అది నిజం కాదని తేలిందని అన్నారు.

Updated Date - 2020-03-16T13:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising