ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 96,792 కరోనా కేసులు... 1,175 మంది మృతి!

ABN, First Publish Date - 2020-09-18T15:38:09+05:30

దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 96,792 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 87,778 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 96,792 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 87,778 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 52,12,686కి చేరుకుంది. మొత్తంగా 41,09,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,175 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకూ కరోనా కారణంగా 84,404 మంది మృతి చెందారు. 



 ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10,17,717గా ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ మాట్లాడుతూ దేశరాజధానిలో కరోనా టెస్టుల సంఖ్య నాలుగింతలకు పెంచామన్నారు. తద్వారా అత్యధిక సంఖ్యలో కరోనా బాధితులను గుర్తించగలుగుతున్నామన్నారు. కాగా ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య మూడు కోట్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2 కోట్ల 19 లక్షలుగా ఉండగా, మృతుల సంఖ్య 9 లక్షల 48 వేలను దాటింది. 

Updated Date - 2020-09-18T15:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising