ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 45 వేలు దాటిన క‌రోనా మృతులు

ABN, First Publish Date - 2020-08-11T16:43:53+05:30

దేశంలో కరోనా వైర‌స్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడ‌చిన‌ 24 గంటల్లో కొత్త‌గా 53,600 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 871 మంది మృతిచెందారు. గ‌డ‌చిన 24 రోజుల్లో కోవిడ్ -19 కేసులు 10 లక్షల నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైర‌స్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడ‌చిన‌ 24 గంటల్లో కొత్త‌గా 53,600 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 871 మంది మృతిచెందారు. గ‌డ‌చిన 24 రోజుల్లో కోవిడ్ -19 కేసులు 10 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగాయి. గత 4 రోజులలో రోజుకు 60 వేల‌కుపైగా కేసులు నమోదవుతున్నాయి. రిక‌వ‌రీ రేటు కూడా పెరిగింది. గ‌డ‌చిన 24 గంటల్లో 47,745 మంది కోలుకున్నారు. దేశంలో రోగుల రికవరీ రేటు 70 శాతంగా ఉంది. జూలై 17 నాటికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832గా ఉండ‌గా, మృతుల‌ సంఖ్య 25,602గా ఉంది. అయితే ఆగస్టు 7న కరోనా వైరస్ కేసుల సంఖ్య 20,27,074 కు పెర‌గ‌గా, మృతుల సంఖ్య 41,585కి చేరుకుంది. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య‌ లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది. కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకోవడానికి 14 రోజులు పట్టింది. 18 రోజుల్లో మొత్తం కేసుల సంఖ్య‌ 4 లక్షలకు చేరుకుంది. క‌రోనా కార‌ణంగా ఆంధ్రప్ర‌దేశ్‌, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల‌లో ఒక్కో రాష్ట్రంలో 2000 కుపైగా మృతిచెందారు. అరుణాచల్, మిజోరం, సిక్కింల‌లో ఐదుగురి కంటే తక్కువ మంది మృతిచెందారు. అరుణాచల్‌లో ముగ్గురు, సిక్కింలో ఒక్క‌రు చొప్పున మరణించారు. మిజోరంలో క‌రోనా కారణంగా ఇంత‌వ‌ర‌కూ ఎవరూ మృతిచెంద‌లేదు. 

Updated Date - 2020-08-11T16:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising