రష్యాలో పెరిగిన కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-03-27T22:09:42+05:30
కాగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5,48,807 కేసులు నమోదు అయినట్లు, 24,862 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అయితే ఇందులో రష్యాలో 85,749 కరోనా కేసులు నమోదు అయ్యాయి
మాస్కో: ప్రపంచ దేశాలన్నీ కరోనాతో కకావికలం అవుతోంటో రష్యాలో పరిస్థితి ఆశాజనకంగానే కనిపించింది. అయితే ఇప్పుడు రష్యాలో సైతం కరోనా చాప కింద నీరులా పాకుతోంది. శుక్రవారం ఒక్క రోజునే 196 కేసులు నమోదైనట్లు రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో రష్యాలో మొత్తంగా 1,036 కేసులు నమోదు అయ్యాయి. సరిహద్దు దేశం చైనాలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ రష్యా తట్టుకొని నిలబడింది. అయితే రోజులు గడిచినా కొద్ది కోరానా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, గడిచిన 24 గంటల్లో రష్యాలో మరో వ్యక్తి కోనాతో మృతి చెందారు.
కాగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5,48,807 కేసులు నమోదు అయినట్లు, 24,862 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అయితే ఇందులో అమెరికాలో 85,749 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఇదే ఎక్కువ. చైనాను, ఇటలీలను దాటి అమెరికాలో ఎక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Updated Date - 2020-03-27T22:09:42+05:30 IST