ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా: ముంబైకి కాస్త ఉప‌శ‌మ‌నం... త‌మిళ‌నాడు, ఢిల్లీల‌లో ఇలా....

ABN, First Publish Date - 2020-05-28T14:56:41+05:30

దేశంలో లాక్‌డౌన్‌ -4 కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ కరోనా రోగుల సంఖ్య తగ్గడంలేదు. దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజధాని ఢిల్లీలో అత్య‌ధిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ -4 కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ కరోనా రోగుల సంఖ్య తగ్గడంలేదు. దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజధాని ఢిల్లీలో అత్య‌ధిక క‌రోనా కేసులు ఉన్నాయి. ఇంతేకాకుండా వలస కూలీలు తిరిగి వస్తున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. అయితే ఇంత‌లో దేశ‌ ఆర్థిక రాజధాని ముంబైకి కొంత ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 రోగుల సంఖ్య 34 వేలకు చేరుకుంది. అయితే  గత 24 గంటల్లో నగరంలో 1044 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గత కొన్ని రోజులతో పోల్చిచూస్తే ఇవి అతి తక్కువ కేసులు. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 57,000 కేసులు నమోదయ్యాయి. 1900 మంది మృతి చెందారు. ఇక తమిళనాడు విషయానికొస్తే కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 817 మందికి కోవిడ్ -19 సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 18 వేలను దాటింది. మొత్తం 136 మంది మృతి చెందారు. ఇక ఢిల్లీలో గత 24 గంటల్లో 792 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 15,275. ఢిల్లీలో ఇప్పటివరకు 303 మంది రోగులు కరోనా కార‌ణంగా మృతి చెందారు. 

Updated Date - 2020-05-28T14:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising