కరోనా క్రిటికల్ పేషంట్స్: భారత్‌లో ఐదు రోజుల్లో, అమెరికాలో 14 రోజుల్లో మృతి!
ABN, First Publish Date - 2020-10-04T14:10:50+05:30
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అమెరికా తరువాత భారత్‌లోనే కరోనా బాధితులు అత్యధికంగా ఉన్నారు. అయితే కరోనా ఉపశమనం విషయానికొస్తే మిగిలిన దేశాలకన్నా భారత్ పరిస్థితి మెరుగ్గావుంది. భారత్‌లోని 85 వేల మంది...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అమెరికా తరువాత భారత్‌లోనే కరోనా బాధితులు అత్యధికంగా ఉన్నారు. అయితే కరోనా ఉపశమనం విషయానికొస్తే మిగిలిన దేశాలకన్నా భారత్ పరిస్థితి మెరుగ్గావుంది. భారత్‌లోని 85 వేల మంది కరోనా బాధితులు, ఆరు లక్షల కాంటాక్ట్ ట్రేసింగ్ కేసులపై యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారత్‌లోని వివిధ ఆసుపత్రులలో క్రిటికల్ కండీషన్‌లోవుంటూ చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఐదు రోజులలో మృతి చెందుతుండగా, అమెరికాలో ఇందుకు 14 రోజులు పడుతోంది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు దేశాలలో చోటుచేసుకుంటున్న మరణాల మధ్య అంతరానికి వైద్య సదుపాయాలే ప్రధాన కారణం. కాగా 65 ఏళ్ల దాటిన కరోనా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్ ప్రచురించింది. బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డాక్టర్ ఝా మాట్లాడుతూ భారత్‌లో ఆర్థిక కారణాలతో చాలామంది కరోనా వ్యాధి తీవ్రమైన తరువాతనే ఆసుపత్రులకు వస్తున్నారు. ఇదే భారత్‌లో కరోనా మృతులకు కారణంగా నిలుస్తోంది. డాక్టర్ లెబనాయీ మాట్లాడుతూ భారత్‌లో కరోనా మరణాల పెరుగుదలకు భాధితులలో అప్పటికే రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు ఉండటం కూడా కారణమన్నారు.
Updated Date - 2020-10-04T14:10:50+05:30 IST