ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదిమంది బంధువులతో.. పది నిమిషాల్లో ముగిసిన పెళ్ళి!

ABN, First Publish Date - 2020-03-27T13:51:39+05:30

మార్చి 26న ఆ ఆలయంలో వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : విల్లుపురం జిల్లాలో గురువారం ఉదయం పదిమంది బంధువుల సమక్షంలో పది నిమిషాల్లో ఓ పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. ఆ జిల్లాలోని తిరువెన్నైనల్లూరు ఈశ్వరాలయంలో మురళీ ధరన్‌ అనే యువకుడికి మీనా అనే యువతితో పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. మార్చి 26న ఆ ఆలయంలో వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఆ మేరకు ఆ ఆలయంలో పెళ్ళి జరిపేందుకు ఫీజు చెల్లించి అను మతి కూడా పొందారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా కరోనా వైరస్‌ కారణంగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. కల్యాణమండపాలు, ఆలయాల్లో కొత్తగా పెళ్ళిళ్లు జరిపేం దుకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ ఆదేశించింది. అదే సమయంలో ముందుగా కల్యాణమండపాలు, ఆల యాలను బుక్‌ చేసుకున్నవారి పెళ్ళి వేడుకలను వంద మందికి మించకుండా జరపాలని, కరోనా నిరోధక నియమాలు పాటించాలని సూచించింది.


ఈ పరిస్థితుల్లోనే మురళీధరన్‌, మీనాల వివాహం గురువారం ఉదయం తిరువెన్నైనల్లూరు ఈశ్వరాలయంలో నిరాడం బరంగా జరిగింది. మురళీధరన్‌ వైపు నుంచి నలుగురు, మీనా వైపు నుంచి నలుగురు బంధువులు మాత్రమే హాజరయ్యారు. పురోహితుడు, ఆలయ అర్చకుడు కలిసి ఈ వివాహాన్ని జరిపించారు.


కరోనా నిరోధక చర్యల్లో భాగంగా వధూవరులు సహా పదిమంది ముందుగా శానిటైజర్లతో శుభ్రంగా చేతులు కడుక్కుని ఆలయ పెళ్ళిమంటపం వద్దకు వెళ్ళారు.  తర్వాత వధూవరు లు పూలదండలు మార్చుకున్న అనంతరం మాంగల్య దారణ జరిపించారు. ఈ వేడుకంతా పది నిమిషాల్లో  ముగిసింది.. ఆ తర్వాత వధూవరూలు, బంధువులు ఆలయం నుంచి తమ ఇళ్ళకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ తమ ఆలయంలో పది నిమిషాల్లో పదిమంది బంధువుల మధ్య పెళ్ళి జరగటం ఇదే ప్రప్రథమమని చెప్పారు.

Updated Date - 2020-03-27T13:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising