ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా టీకా... డిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు!

ABN, First Publish Date - 2020-12-05T17:08:07+05:30

కరోనా టీకా అందుబాటులోకి రాగానే అందరికీ పంపిణీ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకా అందుబాటులోకి రాగానే అందరికీ పంపిణీ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో కరోనా వైరస్ టీకా అందుబాటులోకి రానున్నదని ప్రకటించారు. దీనిలో భాగంగా ముందుగా ఢిల్లీలో 40 నుంచి 50 లక్షల మందికి టీకా వేయనున్నారు. ఈ టీకా డోసులను భద్రపరిచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో టీకాలను భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్షల డోసుల టీకాను సురక్షితంగా ఉంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఫ్రీజర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫ్రిజర్‌లో ఏడాది పొడవునా టీకాను సురక్షితంగా ఉంచేందుకు వీలుంది. ప్రస్తుతం ఈ ఫ్రిజ్‌ను ప్రభుత్వం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంచింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీఎల్ షెర్వల్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాల్లో టీకాను సురక్షితంగా ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.


Updated Date - 2020-12-05T17:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising