ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్యాగమూర్తివమ్మా!!

ABN, First Publish Date - 2020-03-29T07:59:19+05:30

కరోనా విపత్తు దేశాన్ని భయపెడుతున్న తరుణంలో.. గత గురువారం తొలిసారిగా మార్కెట్లోకి తొలి దేశీయ కరోనా నిర్ధారణ పరీక్షల కిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి దేశీయ కరోనా పరీక్షల కిట్‌ 

తయారీ సూత్రధారి మీనల్‌ దఖావే భొసాలే

నిండు గర్భంతో ఉన్నా  ఆరు వారాల్లోనే కిట్‌కు రూపం


న్యూఢిల్లీ, మార్చి 28 : కరోనా విపత్తు దేశాన్ని భయపెడుతున్న తరుణంలో.. గత గురువారం తొలిసారిగా మార్కెట్లోకి తొలి దేశీయ కరోనా నిర్ధారణ పరీక్షల కిట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణ వెనుక ఓ మహిళ కృషి దాగి ఉంది. కొన్ని రోజుల్లో ప్రసవం జరుగుతుందని తెలిసినా ప్రయోగశాలకే అంకితమైన ధీర వనిత ఉన్నారు. ఆమే మీనల్‌ దఖావే భొసాలే. పుణెలోని మైల్యాబ్స్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీ తనకు పరిశోధన, అభివృది విభాగం అధిపతిగా ఇచ్చిన స్థానానికి భొసా లే నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు. తాను నిండు గర్భిణినని తెలిసినా.. దేశానికి సేవ చేయడమే తొలి కర్తవ్యంగా భావించారు. నాలుగు నెలల్లో జరగాల్సిన కిట్‌ అభివృద్ధి ప్రక్రియను 6 వారాల్లో పూర్తిచేశారు. ఈ నెల 18న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) పరిశీలన కోసం కిట్‌ను పంపారు. ఆ మరునాడే ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చారు. మిగతా అనుమతులన్నీ లభించడంతో మైల్యాబ్స్‌కు చెందిన కరోనా కిట్‌ గత గురువారమే(మార్చి 26న) మార్కెట్లోకొచ్చింది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Updated Date - 2020-03-29T07:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising