ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరితలాల శానిటైజేషన్‌కు ఎల్‌ఇడి టెక్నాలజీ

ABN, First Publish Date - 2020-04-08T07:06:40+05:30

కరోనాపై పోరులో ఐఐటీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి. తాజాగా ఐఐటీ గౌహతి ఉపరితలాన్ని క్రిమిరహితంగా శుభ్రం చేసేందుకు ఉపయోగపడే అల్ర్టావయిలెట్‌(యువీసీ) లెడ్‌ ఆధారిత మెషిన్‌ను రూపొందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాపై పోరులో ఐఐటీలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి. తాజాగా ఐఐటీ గౌహతి ఉపరితలాన్ని క్రిమిరహితంగా శుభ్రం చేసేందుకు ఉపయోగపడే అల్ర్టావయిలెట్‌(యువీసీ) లెడ్‌ ఆధారిత మెషిన్‌ను రూపొందించింది.  ఉపరితలాన్ని శానిటైజేషన్‌ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన టెక్నాలజీ యువీసీ. దీని ద్వారా 90 శాతం క్రిములను నశింప చేయవచ్చు. ఇందుకు 186 జౌల్స్‌ థర్మల్‌ డోస్‌ అవసరం. కానీ కరోనా వంటి వైరస్‌ విషయంలో 36 జౌల్స్‌ థర్మల్‌ డోస్‌ సరిపోతుంది. ప్రస్తుతం ఐఐటీ గౌహతి పరిశోధకులు తయారు చేసిన ఈ లెడ్‌ మెషిన్‌ 30 సెకన్లలో 400 జౌల్స్‌ థర్మల్‌ డోస్‌ ఉత్పత్తి చేస్తుంది. ఆస్పత్రులు, బస్సులు, రైళ్లు వంటి చోట్ల ఉపరితలాన్ని శానిటైజేషన్‌ చేసేందుకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.


కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తితో తయారు చేసిన ఈ మెషిన్‌ ఖరీదు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. యువీసీ టెక్నాలజీ ఉంది కాబట్టి దీన్ని వినియోగించే సమయంలో మానవ శరీరానికి ఎటువంటి హాని కలగని విధంగా ప్రత్యేకమైన ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. కరోనాపై పోరులో ఉపరితలాలను క్రిమిరహితంగా ఉంచుకోవడం ముఖ్యం. రానున్న రోజుల్లో ప్రధానంగా లాక్‌ డౌన్‌ను ఎత్తివేసిన తర్వాత బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచేందుకు ఈ మెషిన్‌ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. డోర్‌ హాండిల్స్‌, ప్లాస్టిక్‌ పూత లేదా లామినేటెడ్‌ ఫర్నిచర్‌, గట్టిగా ఉండే ఉపరితలాలపై కరోనా వైరస్‌ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Updated Date - 2020-04-08T07:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising