ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24గంటల్లో 71,196 కేసులు.. అమెరికాలో కరోనా కల్లోలం

ABN, First Publish Date - 2020-07-12T07:00:31+05:30

కరోనా దెబ్బకు అమెరికా కకావికలమవుతోంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే ఇక్కడ 71,196 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 24గంటల వ్యవధిలోనే ఇన్ని కేసులు బయటపడటం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, జూలై 11: కరోనా దెబ్బకు అమెరికా కకావికలమవుతోంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే ఇక్కడ 71,196 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 24గంటల వ్యవధిలోనే ఇన్ని కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. వీటితో కలిపి ఆ దేశంలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 33,21,900కు చేరింది. తాజాగా మరో 915మంది మృత్యువాత పడ్డారు. దక్షిణాఫ్రికాలో తాజాగా 12,348 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడి పాజిటివ్‌లు 2,50,687 కాగా, 3,860 మంది మృతిచెందారు. కరోనా కోరల్లో చిక్కిన బ్రెజిల్‌లో మరో 41,721మందికి వ్యాధి సంక్రమించింది. దీంతో ఈ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18లక్షలు దాటింది. జపాన్‌లో మొదటిసారిగా ఒకేరోజు 430 కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రష్యాలో 6,623 కొత్త కేసులు గుర్తించారు. 


Updated Date - 2020-07-12T07:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising