ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైలో ఒకరికి కరోనా స్ట్రెయిన్‌

ABN, First Publish Date - 2020-12-30T14:50:29+05:30

ముప్పై మంది శ్యాంపిల్స్‌ను పుణే వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రకటన

చెన్నై : లండన్‌ నుంచి వచ్చిన ముప్పై మంది శ్యాంపిల్స్‌ను పుణే వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా చెన్నై నగరానికి చెందిన వ్యక్తికి కరోనా స్ట్రెయిన్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ ప్రకటించారు. బ్రిటన్‌‌లో కరోనా వైరస్‌ కొత్త రూపు, వేగాన్ని సంతరించుకుని విపరీతంగా వ్యాపించటంతో రాష్ట్రంలో నవంబర్‌ 25 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన 2200 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని వీరిలో 17 మందికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయని, వారితో సంబంధాలు కలిగిన 16 మందికి ఆ తర్వాత కరోనా వైద్య పరీక్షలు జరిపామని ఆయన వివరించారు. 


తరువాత కరోనా పాజిటివ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్న 30 మంది రక్త నమూనాలను పుణే పంపామని ఆయన చెప్పారు. వారిలో చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా స్ట్రెయిన్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని గిండీలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్దనున్న కరోనా ప్రత్యేక ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో అడ్మిట్‌ చేశామని రాధాకృష్ణన్‌ తెలిపారు. కాగా మంగళవారం మరో ముగ్గురి రక్త నమూనాలను పుణే ల్యాబ్‌కు పంపినట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2020-12-30T14:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising