ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికవరీ రేటు.. ప్రపంచంలో మనమే టాప్! అమెరికాను వెనక్కు నెట్టి..

ABN, First Publish Date - 2020-09-19T19:55:31+05:30

కరోనా రోగుల రికవరీ రేటులో భారత్ అమెరికాను సైతం వెనక్కు నెట్టి ప్రపంచంలోనే నెం. 1 స్థానానికి చేరుకుంది. ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖకు చెందిన లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 42 లక్షల మంది కరోనాను ఓడించారు. 41 లక్షల మంది అమెరికన్లు కరోనాను జయించడంతో..ఆ దేశాన్ని వెనక్కు నెట్టి భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా రోగుల రికవరీ రేటులో భారత్ అమెరికాను సైతం వెనక్కు నెట్టి ప్రపంచంలోనే నెం. 1 స్థానానికి చేరుకుంది. ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. మంత్రిత్వ శాఖకు చెందిన లెక్కల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకూ దాదాపు 42 లక్షల మంది కరోనాను ఓడించారు. ప్రపంచవ్యప్తంగా కోలుకున్న వారిలో ఇది 19 శాతానికి సమానం. 41 లక్షల మంది అమెరికన్లు కరోనాను జయించడంతో..ఆ దేశాన్ని వెనక్కు నెట్టి భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించింది. 


అధికారిక లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 79.28 శాతానికి చేరుకుంది. కేంద్రం అనుసరిస్తున్న పిటిష్టమైన వ్యూహాల కారణంగానే ఇది సాధ్యమైందని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాధిగ్రస్థుల్ని వీలైనంత త్వరగా గుర్తించడంతో పాటు, అనుమానితుల్ని, వారిని కలుసుకున్న వారిని వేగంగా గుర్తించి వీలైనన్ని కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా రికవరీ రేటు పెరిగిందని తెలిపింది. 


అయితే..కరోనా కేసుల పరంగా ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని 17 శాతం కరోనా కేసులు దేశంలో నమోదైనవే. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటివరకూ దాదాపు 17 లక్షల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో జులై నెలలో 7.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు( ప్రస్తుతం జరుపుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవి) 10.58 శాతానికి చేరుకున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-09-19T19:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising