ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకున్న ప్రిన్స్‌ చార్లెస్‌

ABN, First Publish Date - 2020-04-05T07:11:10+05:30

ప్రిన్స్‌ చార్లెస్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. బ్రిటన్‌లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ఆస్పత్రిని ఆయన శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, ఏప్రిల్‌ 4: ప్రిన్స్‌ చార్లెస్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. బ్రిటన్‌లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ఆస్పత్రిని ఆయన శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. అయితే ఆయన ఆయుర్వేద వైద్యం వల్లే కోలుకున్నారన్న వార్తలను ప్రిన్స్‌ కార్యాలయం ఈ సందర్భంగా ఖండించింది. చార్లెస్‌ ఎలాంటి ఆయుర్వేద వైద్యం తీసుకోలేదని, నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ సూచనలను మాత్రమే పాటించారని తెలిపింది. పోయిన వారం ఆయుష్‌ మంత్రి శ్రీపాద నాయక్‌ మాట్లాడుతూ.. ‘‘బెంగళూరులోని సౌఖ్య ఆయుర్వేద రిసార్ట్‌ గురించి తెలిసే ఉంటుంది. అక్కడ వైద్యుడు ఇసాక్‌ మత్తయ్‌ ప్రిన్స్‌ చార్లె్‌సకు వైద్యం అందించారు. అది విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సౌఖ్య రిసార్టుకి, చార్లె్‌సకు సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని అన్నారు. కానీ తాజాగా ప్రిన్స్‌ కార్యాలయం ఈ ప్రకటనను ఖండించడం గమనార్హం

Updated Date - 2020-04-05T07:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising