ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాంగ శాఖలో కలకలం : ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-05-30T22:54:13+05:30

భారత విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అందులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అందులో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగిలిన ఉద్యోగులందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. విదేశాంగ శాఖలో సెంట్రల్ యూరప్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి కాగా, మరో ఉద్యోగి న్యాయపరమైన విభాగానికి చెందిన వారుగా పేర్కొన్నారు. దీంతో ఈ రెండు విభాగాలకు చెందిన సహ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని, అలాగే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు.


అంతేకాకుండా న్యాయపరమైన విభాగానికి చెందిన అధికారితో కలిసిన వారు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని అధికారులు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన, సూచించిన ఆరోగ్య సూత్రాలను తాము పాటిస్తూనే ఉన్నామని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ రెండు విభాగాలకు దగ్గర్లో ఉన్న మిగితా కార్యాలయాల్లో శానిటైజింగ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-30T22:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising