ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులు చొరబడకుండా ఆరు గస్తీ నౌకలతో నిఘా

ABN, First Publish Date - 2020-04-03T13:59:56+05:30

కరోనా బాధితులు, స్మగ్లర్లు భారత సముద్రతీరంలో చొరబడకుండా రామేశ్వరం తీరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : శ్రీలంక నుంచి కరోనా బాధితులు, స్మగ్లర్లు భారత సముద్రతీరంలో చొరబడకుండా రామేశ్వరం తీరంలో ఆరు నౌకలతో గస్తీ ఏర్పాటు చేశారు. ఈ నౌకలతోపాటు విమానాలు, హెలికాప్టర్లు కూడా సంచరిస్తూ కరోనా బాధితులు రాకుండా అడ్డుకుం టున్నాయి. రామనాథపురం జిల్లా రామేశ్వరం దీవికి చేరువులో శ్రీలంక ఉంది. శ్రీలంకలోనూ ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరు గుతోంది. అక్కడి నుంచి కరోనా సోకినవారు గానీ, స్మగ్లర్లు గానీ భారత  సరిహద్దుల్లో చొరబడకుండా ఉండేందుకు ఆరు నౌకలతో గస్తీ ఏర్పాటు చేశారు.


పాక్‌ జల సంధి ప్రాంతం, మం డపం నుంచి పాంబన్‌ దాకా, రామే శ్వరం, ధనుష్కోడి తీరం పొడవునా భారత నావికాద ళానికి చెందిన నౌక, కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐదు నౌకలు, ఓ విమానం, హెలి కాప్టర్‌ సంచరిస్తున్నాయి. శ్రీలంక నుంచి శరణార్థుల ముసుగులో కరోనా వైరస్‌ బాధితులు భారత సముద్రతీరంలో చొరబడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలి జెన్స్‌ అధికారులు రహస్య సమాచారం అందించడంతో ఈ నౌకలతో రామేశ్వరం తీరం పొడవునా గస్తీ ముమ్మరం చేసినట్టు నావికాదళం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-04-03T13:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising