ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కరోనా అంతానికి డేట్ ఫిక్స్...?

ABN, First Publish Date - 2020-06-07T13:41:00+05:30

భారత్‌లో కరోనా సంక్షోభానికి త్వరలో ముగింపు పడనుందని, సెప్టెంబర్‌లో ఈ సంక్సోభం సమసిపోతుందని ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు నిపుణులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంక్షోభానికి త్వరలో ముగింపు పడనుందని, సెప్టెంబర్‌లో ఈ సంక్షోభం సమసిపోతుందని ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆధారంగా రూపొందించిన ఓ మ్యాథమేటికల్ మోడల్ సాయంతో వారు ఈ అంచనాకు వచ్చారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎపిడెమియోలాజీ ఇంటర్నేషనల్ అనే ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


డీజీహెచ్ఎస్‌కు చెందిన అనిల్ కుమార్(డిప్యూటీ డైరెక్టర్ జనరల్), రూపాలీ రాయ్(డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్) ఈ అంచనాలను రూపోందించారు. బెయిలీ మ్యాథిమెటికల్ మోడల్ అధారంగా, జనాభా వాతావరణ అంశాలు పరిగణలోకి తీసుకుని వారు ఈ మోడల్‌ రూపకల్పన చేశారు.


దీని ప్రకరాం..కరోనానుంచి కోలుకున్న వారి, మరణించిన వారి మొత్తం సంఖ్య కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానమైనప్పుడు కరోనా సంక్షోభం సమసిపోయే స్థితి వస్తుందన్నారు. సెప్టెంబర్ నెల 15 నాటికి భారత్‌ ఈ స్థితికి చేరుకుటుందని వారు చెబుతున్నారు. అయితే జనాభా, వాతావరణ మార్పులు లాంటివి కరోనా వ్యాప్తిని ప్రభావితం చేయకుండా ఉంటే సెప్టెంబర్ నాటికి భారత్‌లో కరోనా సంక్షోభం సమసిపోతుందని తెలిపారు. ఈ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో కరోనా సంక్షోభం మార్చి 2న ప్రారంభమైంది.

Updated Date - 2020-06-07T13:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising