ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో తీవ్రంగా కరోనా ప్రభావం

ABN, First Publish Date - 2020-04-06T23:33:17+05:30

దేశంలో కరోనా పంజా విసురుతోంది. పాజిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పంజా విసురుతోంది. పాజిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఢిల్లీ అంతా నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వం లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసులను మాత్రమే ఢిల్లీలో తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. మీడియా, శానిటేషన్ పనులు చేసేవారు, వైద్య సిబ్బందికి మాత్రమే తిరిగేందుకు అనుమతి ఉంది. 


కరోనా ప్రభావం నాలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ.. వైద్యుల నివేదిక ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలియవచ్చింది. నిత్యం వీవీఐపీలతో రద్దీగా ఉండే పార్లమెంట్ లాక్ డౌన్‌తో నిర్మానుష్యంగా మారింది. కాగా మహారాష్ట్రంలో అత్యధికంగా కరోనా మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో పరిస్థితి దుర్భరంగా ఉంది. లాక్ డౌన్‌ను పకడ్బంధిగా అమలు చేస్తున్నారు. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో ఢిల్లీ, నాల్గో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నివేధిక వెల్లడించింది.

Updated Date - 2020-04-06T23:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising