ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త సవాల్... కరోనా, డెంగీతో ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌!!

ABN, First Publish Date - 2020-09-26T13:32:31+05:30

కరోనా చికిత్సకు ఏ మందు వాడాలో స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంక్లిష్ట తరుణంలో.. ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. కొవిడ్‌ ఉన్నవారిని కొత్తగా డెంగీ కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా చికిత్సకు ఏ మందు వాడాలో స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంక్లిష్ట తరుణంలో.. ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. కొవిడ్‌ ఉన్నవారిని కొత్తగా డెంగీ కూడా చుట్టుముడుతోంది. దీంతో ఏకకాలంలో రెండు ఆరోగ్య సమస్యలకు ఏ చికిత్స అందించాలో తెలియక వైద్యులు తల పట్టుకుంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఈ తరహాలో ‘డబుల్‌’ ఇన్ఫెక్షన్‌ బారినపడటంతో దీనిపై దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ సమస్యకు చికిత్స చేసేందుకు ప్రస్తుతానికి ప్రత్యేకమైన ప్రామాణిక చికిత్సా పద్ధతేదీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏకకాలంలో వీటికి చికిత్సకు ఔషధాలు అందించడంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. రక్త గడ్డకట్టకుండా ఉండేందుకు పలువురు కొవిడ్‌ రోగులకు హెపారిన్‌ ఔషధాన్ని ఇస్తుంటారు. ఇది చివరగా రక్తం దాకా చేరుతుంటుంది. డబుల్‌ ఇన్ఫెక్షన్‌ బారినపడినవారికి హెపారిన్‌ను అందించి.. వెంటనే డెంగీ చికిత్సలో భాగంగా వారి రక్తంలోకి ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చికిత్స అందించాలంటున్నారు.

Updated Date - 2020-09-26T13:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising