ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బీభత్సం: ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 8,380 కొత్త కేసులు!

ABN, First Publish Date - 2020-05-31T17:00:54+05:30

దేశంలో ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగిపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,380 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగిపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8,380 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.82 లక్షలకు చేరుకుంది. కొత్తగా 193 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంక్య 5 వేల మార్కు దాటింది. అయితే భారత్‌లో ఒక్కరోజులో ఎనిమిది వేల పైచిలుకు కేసులు నమోదవడం ఇదే తొలిసారి.


కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో తొమ్మిదా స్థానంలో ఉన్న భారత్ ఉన్న విషయం తెలిసిందే. దేశంలో గత మూడు రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక లాక్ డౌన్‌ ఆంక్షలకు స్వస్తి పలికే దిశగా రాష్ట్రాలు కేంద్రం కదులుతున్న విషయం తెలిసిందే. జూన్ 30 వరకూ లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించినప్పటికీ ఆంక్షల స్ఫూర్తిని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వమే స్పష్టం చేసింది.


హోం శాఖ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. జూన్ 8 తరువాత హోటళ్లు, ప్రార్థనా స్థలాలు, రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. అయితే ఈ సడలింపుల నుంచి కంటెన్మంట్‌ జోన్లను మినహాయించింది.


రాత్రి పూట కర్ఫ్యూ వేళల్లో కూడా మార్పులు చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. మరి కొద్ది వారాలపాటు పరిస్థితిని గమనించిన తరువాత సినిమాళ్లు, స్కూళ్లు తెరవడం, అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించడం వంటి వాటిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. 

Updated Date - 2020-05-31T17:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising