ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకా స్టేజ్‌-3లోకి రాలేదు

ABN, First Publish Date - 2020-03-27T06:35:18+05:30

కరోనా కట్టడికి కేంద్రం లక్షల మంది సామాజిక ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించుతోంది. 9 లక్షల మంది ఆశా వర్కర్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తేల్చిచెప్పిన ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా కట్టడికి కేంద్రం లక్షల మంది సామాజిక ఆరోగ్య సిబ్బందిని రంగంలోకి దించుతోంది. 9 లక్షల మంది ఆశా వర్కర్లు, 30 లక్షల మంది అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలను ఈ పనిలో వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా బాధితుల కోసం పెంచుతున్నామన్నారు. 17 రాష్ట్రాల్లో కరోనా ప్రత్యేక ఆసుపత్రుల ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. కాగా, గడచిన 24 గంటల్లో కేసులు, మరణాల సంఖ్యను చూసినపుడు ఇవి నిలకడగా ఉన్నట్లు అర్థమవుతుందని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. విదేశీప్రయాణం చేయని వారికి వైరస్‌ సోకలేదన్నది కేసుల ద్వారా తెలుస్తోంది. ‘ఒకట్రెండు కేసులను బట్టి స్టేజ్‌-3కి వచ్చామన్న నిర్ధారణకు రావడం సరికాదు. 20-30 శాతం కేసుల్లో పేషెంట్లు తమ వ్యాధి గురించి సరైన సమాచారం ఇవ్వలేదు’ అని ఐసీఎంఆర్‌లోని ఎపిడమాలజీ-కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ విభాగం అధిపతి డాక్టర్‌ రామన్‌ గంగాఖేద్కర్‌ చెప్పారు.

Updated Date - 2020-03-27T06:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising