ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడా విలవిల!

ABN, First Publish Date - 2020-07-14T06:36:35+05:30

కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఆదివారం రికార్డు స్థాయిలో 15,299 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,69,811కి చేరుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒక్కరోజులోనే 15 వేల కేసులు


వాషింగ్టన్‌, జూలై 13: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ముఖ్యంగా ఫ్లోరిడాలో ఆదివారం రికార్డు స్థాయిలో 15,299 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 2,69,811కి చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఒక్కరోజులోనే 15వేలకుపైగా నమోదవడం ఇదే తొలిసారి. అలాగే అమెరికా వ్యాప్తంగా గత 24 గంటల్లో 56వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. అమెరికా తొలినుంచీ ఆరోపిస్తున్నట్టుగానే మహమ్మారి కరోనా వైర్‌సకు మూలం చైనాలోనే ఉందనే విషయాన్ని నిర్ధారించే పనిలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇద్దరు నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వారు చైనాలోనే ఉన్నారు. మెక్సికోలో కొవిడ్‌-19 మరణాల సంఖ్య 35వేల మార్కుని దాటేసింది. సోమవారం ఇక్కడ 276 మంది చనిపోగా.. మొత్తం మృతులు 35,006కి చేరుకున్నారు. ఈ క్రమంలో మరణాల్లో ఈ దేశం ఇటలీ (34,954)ని దాటేసింది. పాకిస్థాన్‌లోనూ బాధితుల సంఖ్య 2.50 లక్షల మార్కుని దాటేసింది. ఇక్కడ కొత్తగా 2,769 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 2,51,625కి ఎగబాకింది.  

Updated Date - 2020-07-14T06:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising