కరోనా కల్లోలం: గ్రామాల్లో భీతావహం... పట్టణాల్లో ఉపశమనం!
ABN, First Publish Date - 2020-12-01T17:02:21+05:30
దేశంలో పట్టణాల్లో కన్నా పల్లెల్లో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో పట్టణాల్లో కన్నా పల్లెల్లో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్టోబరు 24 నుంచి 31 వరకూ నమోదైన కరోనా కేసులతో... నవంబరు 21 నుంచి 29 వరకూ నమోదైన కేసులను పోల్చిచూస్తే దేశంలోని 284 జిల్లాల్లో నవంబరు ఆఖరివారంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. మరోవైపు దేశంలోని 633 జిల్లాలలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య స్పష్టంగా తెలియలేదు. మీడియాకు అందిన గణాంకాల ప్రకారం పట్టణాలతో నమోదవుతున్న కరోనా కేసులతో పోలిస్తే, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సెప్టెంబరు నుంచి ప్రతీరోజూ సుమారు 90 వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వీటిలో 80 శాతం కేసులు గ్రామీణప్రాంతాల్లోనివే కావడం విశేషం. ఇదేసమయంలో పట్టణప్రాంతాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుమఖం పడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్ చివరి వారంలో నమోదైన కేసులలో 77 శాతం కేసులు పట్టణ ప్రాంతాల్లోనే నమోదు కాగా, కేవలం 10 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. నవంబరు 29 నాటికీ ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసులలో 52 శాతం కేసులు పట్టణ ప్రాంతాలకు చెందినవి కాగా, 24 శాతం కేసులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి. దీనికి కారణం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్‌ల సంఖ్యలో తేడా ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
Updated Date - 2020-12-01T17:02:21+05:30 IST