ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచవ్యాప్తంగా 61లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-31T18:21:00+05:30

ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 61 లక్షలు దాటాయి. బ్రెజిల్‌వో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అమెరికాలో కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 61,56,914 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,70,918 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 27,37,039 మంది కోలుకున్నారు. 


అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 16,16,820 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,05,557 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 5,35,238 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 4,99,966 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 28,849 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 2,05,371 మంది కోలుకున్నారు. అలాగే స్పెయిన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,86,308 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 27,125 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,96,958 మంది కోలుకున్నారు. రష్యాలో గత 24 గంటల్లో మొత్తం 3,96,575 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 4,555 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,67,469 మంది కోలుకున్నారు.

 

ఇటలీలో గత 24 గంటల్లో మొత్తం 2,32,664 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 33,340 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 1,55,633 మంది కోలుకున్నారు. ఫ్రాన్స్‌లోచూస్తే గత 24 గంటల్లో మొత్తం 1,88,625 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 28,771 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 68,268 మంది కోలుకున్నారు. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మొత్తం 2,71,222 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 38,161 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 30,245 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-05-31T18:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising