ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాపై కరోనా దెబ్బ.. పీహెచ్‌డీసీసీఐ వెల్లడి

ABN, First Publish Date - 2020-05-24T07:21:51+05:30

కరోనా మహమ్మారితో మీడియా రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని, ఈ రంగానికి ప్రకటనల ద్వారా వచ్చే రాబడి భారీగా క్షీణించిందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ (పీహెచ్‌డీసీసీఐ) పరిశోధనా నివేదిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 23: కరోనా మహమ్మారితో మీడియా రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని, ఈ రంగానికి ప్రకటనల ద్వారా వచ్చే రాబడి భారీగా క్షీణించిందని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ (పీహెచ్‌డీసీసీఐ) పరిశోధనా నివేదిక వెల్లడించింది. ‘‘ప్రింట్‌ మీడియా పెద్ద మొత్తంలో సర్క్యులేషన్‌ను కోల్పోయింది. భారీగా ప్రకటనల రాబడి తగ్గింది. ఎలక్ర్టానిక్‌ మీడియా కూడా భారీగా ప్రకటనల రాబడిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని నివేదికలో పేర్కొంది. ‘‘కొవిడ్‌-19 కాలంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ ఔట్‌లుక్‌’’ పేరుతో ఈ నివేదికను రూపొందించారు. దీన్ని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌కు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డీకే అగర్వాల్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ అగర్వాల్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ ముఖేశ్‌గుప్తా సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రకటనల బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించేలా చూడాలని ప్రభుత్వాన్ని సంజయ్‌ అగర్వాల్‌ కోరారు. 


Updated Date - 2020-05-24T07:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising