ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

ABN, First Publish Date - 2020-07-12T08:11:31+05:30

కరోనా మహమ్మారి మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని ది పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండి యా (పీఎ్‌ఫఐ)అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా పీఎఫ్‌ ఐ ‘ మహిళలపై కరోనా ప్రభావం’ పేరు తో ఒక నివేదికను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కీలకమైన ఆరోగ్య సేవలకు అంతరాయం
  • ‘పీఎ్‌ఫఐ’ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 11: కరోనా మహమ్మారి మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని ది పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండి యా (పీఎ్‌ఫఐ)అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా పీఎఫ్‌ ఐ ‘ మహిళలపై కరోనా ప్రభావం’ పేరు తో ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం లింగ సమానత్వం, మహిళల లైం గిక, పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్య సేవలను కరోనా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా మహిళలకు, బాలికలకు ఎంతో కీలకమైన కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి, ప్రసవానంతర ఆరోగ్య సంరక్షణ వంటి వైద్యసేవలకు అంతరాయం కలుగుతోంది. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. లైంగిక, పునరుత్పత్తికి సంబంధించిన సేవ లు పరిమితంగా లభించడం దీర్ఘకాలంలో మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంద ని పీఎ్‌ఫఐ పేర్కొంది. ‘కరోనా మొదలైనప్పటీ నుంచి మహిళలు లైంగిక వేధింపులకు, గృహహింసకు లోనయ్యే సందర్భాలు పెరిగాయి. కరోనాతో వారికి అందే ఆరోగ్య సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతోంది’ అని పీఎ్‌ఫఐ సీఈవో పూనమ్‌ ముత్రేజా చెప్పారు. 


Updated Date - 2020-07-12T08:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising