ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి కోసం మతం మారడంపై త్వరలో నిషేధం : కర్ణాటక మంత్రి

ABN, First Publish Date - 2020-11-04T02:18:56+05:30

పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ ఓ చట్టాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నామని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మంగళవారం చెప్పారు. రాష్ట్రంలో యువతుల గౌరవ, మర్యాదలను జీహాదీలు దెబ్బతీస్తూ ఉంటే ప్రభుత్వం మౌనంగా ఉండబోదని చెప్పారు. 


‘లవ్ జీహాద్’కు వ్యతిరేకంగా, పెళ్లి కోసం మతం మార్చుకోవడాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకొస్తామని ఇటీవలే ఉత్తర ప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పులో కూడా పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడం చట్టవిరుద్ధమని చెప్పింది. 


సీటీ రవి మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, అలహాబాద్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పెళ్లి కోసం మతాన్ని మార్చుకోవడాన్ని నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. తమ సోదరీమణుల గౌరవ, మర్యాదలను జీహాదీలు దెబ్బతీస్తూ ఉంటే తాము మౌనంగా ఉండబోమని చెప్పారు. మత మార్పిడికి కారకులయ్యేవారు కఠిన చర్యలను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు.


Updated Date - 2020-11-04T02:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising