ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ సొంత రాష్ట్రంపై గురిపెట్టిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-07-11T05:30:00+05:30

నరేంద్రమోదీ సొంత రాష్ట్రంపై కాంగ్రెస్ గురిపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరేంద్రమోదీ సొంత రాష్ట్రంపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఓ వైపు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే దిశగా పార్టీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే పాటీదార్ ఆందోళన సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేస్తుండడంతో రాష్ట్రంలో బలం పెంచుకునే నిర్ణయాలు తీసుకుంది.


2019 లోక్ సభ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన హార్ధిక్‌కు ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక పదవి దక్కింది. హార్దిక్ వయసు కేవలం 27 ఏళ్లు. చిన్న వయసులోనే పాటీదార్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. అయితే హార్దిక్‌ పదవి గురించి పార్టీ కీలక నేతలకు తెలియదంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 8 మంది నేతలు రాజీనామా చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో పార్టీకి దెబ్బతగిలింది. ఈ నేపథ్యంలో పాటీదార్ల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2020-07-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising