ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ వ్యవస్థ కుప్పకూలింది

ABN, First Publish Date - 2020-11-23T07:47:47+05:30

కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని సీనియర్‌నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. బిహార్‌ ఎన్నికల తరువాత తొలిసారి స్పందించిన ఆయన పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్లాక్‌ స్థాయి నుంచి మళ్లీ నిర్మించాలి: ఆజాద్‌


న్యూఢిల్లీ, నవంబరు 22: కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని సీనియర్‌నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. బిహార్‌ ఎన్నికల తరువాత తొలిసారి స్పందించిన ఆయన పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదన్నారు. ‘‘పంచాయతీ, మండల స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థలో ఎవరైనా నేత ఎన్నికైతే అది సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుత వ్యవ స్థ వల్ల లాభం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డా రు. కపిల్‌ సిబ్బల్‌ విమర్శల్లో లోపాలు ఎత్తిచూపుతూ  ఇది నాయకత్వ సమస్య కాదన్నారు. ‘‘నాయకుణ్ణి మార్చేస్తే మనం బిహార్‌, మధ్యప్రదేశ్‌, యూపీల్లో గెలిచేస్తామనుకుంటే పొరపాటు. వ్యవస్థను మార్చినప్పు డే ఇది సాధ్యం’’ అన్నారాయన. ప్రజలకు కాంగ్రెస్‌ నేత లకు మధ్య సంబంధం తెగిపోయిందన్నారు. నాయకులు ఫైవ్‌స్టార్‌ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. 


నాయకత్వ సంక్షోభం లేదు: ఖుర్షీద్‌

కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం లేదని, సోనియా, రాహుల్‌ గాంధీల నాయకత్వానికి అందరి మద్దతు ఉందని పార్టీ మరో సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను అధిష్ఠానం గౌరవిస్తుందని, బిహార్‌లో పార్టీ పరిస్థితిపై కపిల్‌ సిబ్బల్‌ చెప్పిన దాంట్లో వాస్తవముందన్నారు.

Updated Date - 2020-11-23T07:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising