ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ జాతీయ సదస్సు

ABN, First Publish Date - 2020-12-29T09:34:32+05:30

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సదస్సు వచ్చే ఏడాది రాజస్థాన్‌లో జరగనుంది. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో సదస్సు ఉండవచ్చని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాహుల్‌ను మళ్లీ అధ్యక్షుడిగా ప్రతిపాదించనున్న పార్టీ!


న్యూఢిల్లీ, డిసెంబరు 28: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సదస్సు వచ్చే ఏడాది రాజస్థాన్‌లో జరగనుంది. జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో సదస్సు ఉండవచ్చని ఆ వర్గాలు చెప్పాయి. సదస్సు ఏర్పాట్లపై పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతం రాహుల్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి స్వదేశానికి వచ్చాక సదస్సు నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఆ వర్గాలు తెలిపాయి. అలాగే రాహుల్‌ను మళ్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించాలని ఈ సదస్సులో పార్టీ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. కాగా విహారయాత్ర కోసమే రాహుల్‌ విదేశీ పర్యటనకు వెళ్లారని విమర్శించిన బీజేపీకి కాంగ్రెస్‌ సమాధానం ఇ చ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బంధువును చూడ్డానికే ఆయన అక్కడికి వెళ్లారని ఆ పార్టీ నాయకుడు రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు.

Updated Date - 2020-12-29T09:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising