ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభకు మల్లికార్జున ఖర్గే

ABN, First Publish Date - 2020-06-05T20:59:23+05:30

కర్ణాటక నుంచి రాజ్యసభకు జరుగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేరును అధిష్ఠానం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కర్ణాటక నుంచి రాజ్యసభకు జరుగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఖర్గే అభ్యర్థిత్వాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రాష్ట్రాల నుంచి 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరుగనున్నాయి.


కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నేత అయిన 78 ఏళ్ల ఖర్గే.. 2009 నుంచి గుల్బర్గా ఎంపీగా గెలుస్తూ వచ్చారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నుంచి ఉమేష్ జాదవ్‌పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. వరుసగా 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేతగా, రైల్వే, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

Updated Date - 2020-06-05T20:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising