ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకేదైనా అయితే పంజాబ్ సీఎందే బాధ్యత: కాంగ్రెస్ ఎంపీ

ABN, First Publish Date - 2020-08-12T02:20:10+05:30

అయితే తనకు పూర్తిగా భద్రత తొలగించారని, దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. దీని వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని బజ్వా ఆరోపిస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై సొంత పార్టీ నేతే తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఏదైనా జరిగితే కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు పంజాబ్ డీజీపీదే బాధ్యతని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ బజ్వాకు ఉన్నట్లుండి భద్రతలో మార్పులు చేశారు. అయితే తనకు పూర్తిగా భద్రత తొలగించారని, దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. దీని వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని బజ్వా ఆరోపిస్తున్నారు.


‘‘ఉన్నట్టుండి రాత్రికి రాత్రే నాకు భద్రత తొలగించారు. పంజాబ్ డీజీపీ ఆదేశాల మేరకే ఇలా జరిగింది. అయితే దీని వెనుక రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నాయి. వారి సూచనల మేరకే డీజీపీ ఈ ఆదేశాలు జారీ చేశారు. నాకేదైనా అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు పంజాబ్ డీజీపీదే బాధ్యత’’ అని బజ్వా అన్నారు.

Updated Date - 2020-08-12T02:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising