ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నేతలకు గుడులు గుర్తొస్తాయి : బీజేపీ ఎంపీ

ABN, First Publish Date - 2020-10-05T01:46:27+05:30

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రాకేశ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రాకేశ్ సింగ్ ఆదివారం కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తీరును దుయ్యబట్టారు. కమల్‌నాథ్ ఆదివారం జబల్‌పూర్‌లోని బగళాముఖి దేవాలయంలో పూజలు చేసిన నేపథ్యంలో రాకేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు ఎన్నికలు సమీపించినపుడు మాత్రమే దేవాలయాల గురించి ఆలోచిస్తారని ఎద్దేవా చేశారు. 


కాంగ్రెస్ నేతలు దేవాలయాలకు వెళ్ళరని, అందువల్ల తప్పులు చేస్తూ ఉంటారని అన్నారు. ఈ రోజు కూడా కమల్‌నాథ్ పూజలు చేసేటపుడు తప్పులు చేశారని ఆరోపించారు. దేవుడు కూడా వారికి అండగా లేడన్నారు. 


భారత దేశానికి అత్యాచారాల రాజధానిగా మధ్య ప్రదేశ్ మారుతోందని కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను రాకేశ్ తప్పుబట్టారు. కమల్‌నాథ్ అధికారంలో ఉన్నపుడు రైతులు, యువత గురించి పట్టించుకోలేదన్నారు. అటువంటి నేత ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు అంగీకరించబోరని జోస్యం చెప్పారు. ఏడు నెలల క్రితం బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మధ్య ప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయన్నారు.


మధ్య ప్రదేశ్‌లో 28 శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నవంబరు 3న జరుగుతాయి. 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ముగ్గురు ఎమ్మెల్యేలు మరణించడం వల్ల ఈ ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. 


Updated Date - 2020-10-05T01:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising