ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల 'భారత్ బంద్‌'కు కాంగ్రెస్ మద్దతు

ABN, First Publish Date - 2020-12-06T20:44:42+05:30

కేంద్రం ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘలు ఈనెల 8న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘలు ఈనెల 8న జరుపనున్న 'భారత్ బంద్‌'కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఆదివారంనాడు మీడియాకు ఈ విషయం తెలిపారు. రైతు బంద్‌కు మద్దతుగా తాము పార్టీ కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు బాసటగా నిలుస్తున్న రాహుల్‌కు మరింత బలం చేకూర్చేలా కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని, దీనిని విజయవంతం చేసి తీరుతామని చెప్పారు.


వ్యవసాయ బిల్లులను కేంద్రం హడావిడిగా పార్లమెంటులో ఆమోదించడం వెనుక ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని పవన్ ఖేరా చెప్పారు. 'రైతుల దుస్థితిని యావత్ ప్రపంచం చూస్తోంది. ప్రభుత్వం తమ గోడు వింటుందేమోనన్న ఆశతో చలిగాలుల్లో అర్ధరాత్రులు రోడ్లపై రైతులు పడుతున్న అవస్థలు అంతా గమనిస్తున్నారు. రైతులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగాల్సిన ప్రాథమిక బాధ్యత మనకుంది' అని పవన్ ఖేరా అన్నారు.


కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో హడావిడిగా ఆర్డినెన్స్‌లు, బిల్లులు ఎందుకు తేవాల్సి వచ్చిందని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. 'విపక్ష పార్టీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ విధివిధానాలను పాటించలేదు. హడావిడిగా బిల్లులు ఆమోదింపజేసుకున్నారు. రైతుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వం, కార్పొరేట్ మిత్రుల మధ్య సాగిన కుట్ర ఫలితమే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. రైతులు బాధితులయ్యారు. రైతులకు ఈ విషయం బాగా తెలుసు' అని ఆయన అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత 11 రోజులుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-12-06T20:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising