ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దల సభ నుంచి వెళ్లగొట్టడం అప్రజాస్వామికం: అధీర్ రంజన్

ABN, First Publish Date - 2020-09-21T21:30:46+05:30

రాజ్యసభ నుంచి ఎంపీలను బహిష్కరించడం సిగ్గుమాలిన, అప్రజాస్వామిక చర్య అని ప్రభుత్వంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఎంపీలను బహిష్కరించడం సిగ్గుమాలిన, అప్రజాస్వామిక చర్య అని ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. యథాతథ పరిస్థితి పునరుద్ధరించేందుకు తాము నిరసన సాగిస్తామని తెలిపింది. పార్లమెంటు హౌస్‌ వెలుపల విజయ్ చౌక్‌లో తమ పార్టీ సహచరులను కలిసిన కాంగ్రెస్ లోకసభాపక్ష నేత అధినేత అధీర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బిల్లులపై పెల్లుబికిన రైతు వ్యతిరేకతను యావద్దేశం చూసిందని, డివిజన్ ఆఫ్ ఓట్స్ కోసం తాము కోరామని, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు తమకు ఉందని చెప్పారు. పార్లమెంటు నిబంధనల పరిధిలోకే ఇవన్నీ వస్తాయని తెలిపారు.


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, పార్లమెంటు లోపల, వెలుపల కూడా అసమ్మతి గళాన్ని బలవంతంగా నొక్కేస్తున్నారని విమర్శించారు. తాము రైతుల హక్కుల కోసం పోరాడుతున్నామని, మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. రైతు బిల్లులను వ్యతిరేకించిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. డివిజన్ ఆఫ్ ఓట్స్ కోసం పట్టుబట్టడం అన్‌పార్లమెంటరీ ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తెచ్చిన బిల్లులతో వ్యవసాయం రంగం పూర్తిగా ధ్వసమవుతుందని అన్నారు.


రాజ్యసభ నుంచి మంగళవారంనాడు సస్పెన్షన్‌కు గురైన 8 మంది ఎంపీలు పార్లమెంటు ఆవరణలోనే నిరవధిక నిరసన చేస్తామని ప్రకటించారు. వారం రోజుల పాటు ఈ ఎంపీలపై రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు బహిష్కరణ వేటు వేశారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్, డోలా సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సైయద్ నసీర్ హుస్సేన్, సీపీఎం ఎంపీ కేకే రాగేష్, ఎలమారం కరీంలపై బహిష్కరణ వేటు పడింది.

Updated Date - 2020-09-21T21:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising