ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెహ్లాట్‌ సర్కార్‌ను కూల్చాలనుకున్న వసుంధర: కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-07-20T00:45:57+05:30

రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో 'బేరసారాల' వ్యవహారంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే పేరు కూడా వచ్చి చేరింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు జరుగుతున్న బేరసారాల వ్యవహారాల్లో వసుంధరా రాజే ప్రమేయం కూడా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుడా ఆదివారంనాడు ఆరోపించారు.


ఎమ్మెల్యేలతో బేరసారాల కేసులో అరెస్టయిన సంజయ్ జైన్ సుమారు ఎనిమిది నెలల క్రితం తనను సంప్రదించారని రాజేంద్ర వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంజయ్ జైన్‌ను శనివారంనాడు అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర గుడా మాట్లాడుతూ, వసుంధరా రాజేను, మరి కొందరిని కలవాల్సిందిగా సంజయ్ జైన్ తనకు సూచించారని, అలాంటి ఏజెంట్లు చాలామందే ఉన్నారని అన్నారు. అయితే వీరి ప్రయత్నాలు ఏమాత్రం విజయవంతం కావని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

Updated Date - 2020-07-20T00:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising