ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ మేనిఫెస్టో: నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్, సుప్రీంలో సీఏఏ సవాలు

ABN, First Publish Date - 2020-02-02T20:15:29+05:30

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. పార్టీ రాష్ట్ర ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. ఇందులో నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్‌కు హామీ ఇచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చోప్రా, కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్‌లు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు రూ.5,000, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున ప్రతి నెలా నిరుద్యోగ భృతి కల్పిస్తామని, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఈ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. 'అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న రూపంలో ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను అమలు చేసేది లేదు' అని పేర్కొంది. సుప్రీంకోర్టులో సీఏఏను సవాలు చేస్తామని తెలిపింది. గతంలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, ఈనెల 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 11న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2020-02-02T20:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising