ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ గీతం కరెక్టుగా పాడితేనే కాండక్ట్‌ సర్టిఫికెట్‌!

ABN, First Publish Date - 2020-06-18T14:37:27+05:30

జాతీయ గీతం తప్పులు లేకుండా పాడితేనే కాండక్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తామంటున్న పుదుచ్చేరి పోలీసుల చర్యలను ప్రజలు, నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పుదుచ్చేరి లాస్‌పేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: జాతీయ గీతం తప్పులు లేకుండా పాడితేనే కాండక్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తామంటున్న పుదుచ్చేరి పోలీసుల చర్యలను ప్రజలు, నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పుదుచ్చేరి లాస్‌పేట లెనిన్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు బి.కాం పూర్తిచేశాడు. అతనికి పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం లభించింది. ఇందుకోసం అతని విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు కాండక్ట్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిరావడంతో అతను లాస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణన్‌, ఏఎస్‌ఐ కీర్తిలు ఆ యువకుడిని తప్పులు లేకుండా జాతీయగీతం పాడాలని కోరగా అతను పాడలేక పోయాడు. జాతీయగీతం నేర్చుకొని బుధవారం వచ్చి తప్పులు లేకుండా పాడితే సర్టిఫికెట్‌ ఇస్తామని వారు పేర్కొన్నారు. దీంతో ఇంటికెళ్లిన యువకుడు రాత్రంతా జాతీయ గీతం బట్టీపట్టి బుధవారం ఉదయం స్టేషన్‌కు వచ్చి తప్పులు లేకుండా పాడడంతో పోలీసులు సర్టిఫికేట్‌ను అందజేశారు. 

Updated Date - 2020-06-18T14:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising