ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. చెన్నై తర్వాత మరో నగరంలో..

ABN, First Publish Date - 2020-06-23T03:04:30+05:30

కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధురై: కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మధురై నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు పళని సర్కార్ గుర్తించింది. కరోనా తీవ్రత దృష్ట్యా మధురైలో జూన్ 23 నుంచి జూన్ 30 వరకూ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధురై కార్పొరేషన్ పరిధితో పాటు, మధురై తూర్పులోని రూరల్ ప్రాంతాల్లో, పశ్చిమ మధురైలోని తిరుపరనకుండ్రంలో రేపటి నుంచి జూన్ 30 వరకూ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదని ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో, రైల్వే స్టేషన్లకు, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. 33 శాతం ఉద్యోగులతో మధురైలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కూడా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-06-23T03:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising