ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వర్క్ ఫ్రం హోటల్’కు పెరుగుతున్న ఆదరణ

ABN, First Publish Date - 2020-07-09T20:46:34+05:30

‘వర్క్ ఫ్రం హోటల్’... ఈ కొత్త విధానానికి ఇప్పుడు వివిధ రంగాల నుంచి స్పందన లభిస్తోంది. పెద్ద పెద్ద సంస్థలు అనుసరిస్తోన్న ‘వర్క్ ఫ్రం హోం’కు ప్రత్యామ్నాయంగా ‘వర్క్ ఫ్రం హోటల్’ విధానం ఇప్పుడు విస్తరిస్తోంది. చిన్న కంపెనీల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు తాజాగా ఈ దిశగా ద‌ష్టి సారిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘వర్క్ ఫ్రం హోటల్’... ఈ కొత్త విధానానికి ఇప్పుడు వివిధ రంగాల నుంచి స్పందన లభిస్తోంది. పెద్ద పెద్ద సంస్థలు అనుసరిస్తోన్న ‘వర్క్ ఫ్రం హోం’కు ప్రత్యామ్నాయంగా ‘వర్క్ ఫ్రం హోటల్’ విధానం ఇప్పుడు విస్తరిస్తోంది. చిన్న కంపెనీల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు తాజాగా ఈ దిశగా ద‌ష్టి సారిస్తున్నాయి.


కరోనా నేపధ్యంలో ఇప్పటికే పలు సంస్థలు... పలు మార్పులకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగమే వర్క్ ఫ్రం హోం. అయితే... ఈ విధానంలో ఉద్యోగులు కొన్న పరిమితులకు లోబడి పనిచేసే వీలుంటుంది. కానీ, పెద్ద సమావేశాలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల విషయాల్లో వర్క్ ఫ్రం హోటల్ కాన్సెప్ట్ విధానమే మేలని కంపెనీలు భావిస్తున్నాయి.


ఇక హోటళ్ళైతే... ఇలాంటి ‘వర్క్ ఫ్రం హోటల్’ విధానాన్ని అందించేందుకు నెలల ప్రాతిపదికన వేర్వేరు ప్యాకేజీలను అందించే దిశగా ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు... కరోనా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండేందుకు... హోటళ్ళు కూడా... కొత్త విధానాన్ని తమవంతు ప్రోత్సాహిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా... ‘వర్క్ ఫ్రం హోటల్’ విధానాన్ని మరింత పాపులర్ చేసేందుకుగాను ప్రముఖ హోటళ్ళు... తాజాగా నెలకొన్న కరోనా పరిస్థితులతోపాటు అటు సంస్థలపై కూడా విపరీతమైన స్థాయిలో ఆర్ధిక భారం పడకుండా చూస్తూ కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చే దిశగా యోచిస్తున్నాయి.


కాగా... ఈ క్రమంలో తమ రోజువారీ నిర్వహణ ఖర్చులను, ఇతరత్రా అనవసర వ్యయాలను తగ్గించుకునేందుకు మార్గాలను అణ్వేషిస్తున్నాయి. మొత్తంమీద ఇప్పటివరకు... అప్పుడప్పుడు ఏవైనా సమావేశాలకో, ఇతరత్రా అంశాలకో మాత్రమే పరిమితమైన హోటళ్ళు... ఇకపై... విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులతో దర్శనమివ్వనున్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-09T20:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising