ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక వ్యాప్తి దశకు కరోనావైరస్ ...

ABN, First Publish Date - 2020-07-07T11:27:28+05:30

కరోనా వైరస్ వ్యాప్తిపై కర్ణాటక రాష్ట్ర మంత్రి మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక మంత్రి మధుస్వామి సంచలన వ్యాఖ్యలు 

బెంగళూరు (కర్ణాటక): కరోనా వైరస్ వ్యాప్తిపై కర్ణాటక రాష్ట్ర మంత్రి మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు వచ్చిందని ఆ రాష్ట్ర మంత్రి జేసీ మధుస్వామి వ్యాఖ్యానించారు. ‘‘తూముకూరు కొవిడ్ ఆసుపత్రిలో చేరిన 8 మంది కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, వారు బతుకుతారన్న  గ్యారంటీ లేదు...కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు వచ్చింది’’ అని తూముకూరు జిల్లా ఇన్ చార్జి మంత్రి అయిన మధుస్వామి చెప్పారు. కరోనా కట్టడి చేయడం జిల్లా అధికారులకు కష్టతరంగా మారిందని, ఇక పరిస్థితులు తమ చేతుల్లో లేవని మంత్రి పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు రాలేదని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ లు ఖండించారు. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,474కు చేరగా,దీనివల్ల 372 మంది మరణించారు.

Updated Date - 2020-07-07T11:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising