ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తైన వేళ జమ్మూ కశ్మీర్ నేతల మాట ఇదీ..!

ABN, First Publish Date - 2020-08-23T05:02:39+05:30

ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు తామంతా కట్టుబడి ఉన్నట్టు జమ్మూ కశ్మీర్‌కి చెందిన ఆయా పార్టీల నేతలు పునరుద్ఘాటించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు తామంతా కట్టుబడి ఉన్నట్టు జమ్మూ కశ్మీర్‌కి చెందిన ఆయా పార్టీల నేతలు పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము ‘‘అంగీకరించే ప్రసక్తే లేదని’’ వారు స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా గుప్తార్ డిక్లరేషన్‌పై సంతకాలు చేసిన నేతలంతా ఇవాళ సమావేశం అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సహా పలువురు నేతలు ఇవాళ సమావేశమైన వారిలో ఉన్నారు. ‘‘‘జమ్మూ కశ్మీర్లో మాతో సంబంధం లేకుండా, మా గురించి ఏ నిర్ణయం తీసుకోరాదన్న నిర్ణయానికి మేమంతా ఏకగ్రీవంగా పునరుద్ఘాటిస్తున్నాం....’’ అని నేతలు పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని కాపాడుకోవడమే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్ నేతలు గుప్కర్ డిక్లరేషన్ 2019 ఆగస్టు 4న సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, జమ్మూ కశ్మీర్‌ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-08-23T05:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising