ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై... రికార్డ్ స్థాయిలో భారీ వర్షం...

ABN, First Publish Date - 2020-08-05T01:12:45+05:30

దాదాపు పదిహేనేళ్ళ తర్వాత ఇదే పెద్ద వర్షం. ముంబైలో... సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం ప్రత్యేకత ఇది. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే స్వయంగా ఈ వ్యాఖ్యానం చేశారంటే ఆ వర్షం ఉధృతి ఎంతటిదో అర్ధమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దాదాపు పదిహేనేళ్ళ తర్వాత ఇదే పెద్ద వర్షం. ముంబైలో... సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం ప్రత్యేకత ఇది. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే స్వయంగా ఈ వ్యాఖ్యానం చేశారంటే ఆ వర్షం ఉధృతి ఎంతటిదో అర్ధమవుతుంది. 


దేశ ఆర్థిక రాజధాని ముంబై... భారీ వర్షాలతో అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే. గత రాత్రి నుంచి  ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరం నీటమునిగింది. 


కుండపోత పోసినట్టుగా... కేవలం నాలుగు గంటల్లో 198 మిమీ వర్షపాతం నమోదైందని, ఇలాంటి వర్షంతో ప్రపంచంలో ఏ నగరం అయినా మునిగిపోతుందన్న వ్యఖ్యానాలూ వినవచ్చాయి. 


గత రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన వర్షం ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నిలిచింది. ఆ తర్వాత కూడా కొద్దిపాటి విరామాలతో కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవధిలో మొత్తం 230 మిమీ వర్షపాతం రికార్డయింది. కాగా, భారీ వర్షాలతో ముంబై లోకల్ ట్రైన్ వ్యవస్థ నిలిచిపోయింది.


అత్యవసర సర్వీసులు మినహా ఇతర  కార్యాలయాలు తెరుచుకోలేదు. ముంబైతో పాటు పరిసర జిల్లాల్లోనూ... రేపు కూడా అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. 

Updated Date - 2020-08-05T01:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising