ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి : తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల సంఘం

ABN, First Publish Date - 2020-08-05T22:53:36+05:30

కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం విధించిన అష్ట దిగ్బంధనం వల్ల తాము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోయంబత్తూరు : కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం విధించిన అష్ట దిగ్బంధనం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని కోయంబత్తూరు పరిశ్రమల సంఘాల సమాఖ్య వాపోతోంది. ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి, జిల్లా కలెక్టర్‌కు లేఖలు రాసింది. 


అష్ట దిగ్బంధనం ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలని, ఈ-పాస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోయంబత్తూరు పరిశ్రమల సంఘాల సమాఖ్య కోరింది. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)కు 2018లో ప్రకటించిన 2 శాతం వడ్డీ సహాయాన్ని అందజేయాలని, ఎంఎస్ఎంఈల యజమానులు ఈ-పాస్‌లు లేకుండా అంతర్ జిల్లాల్లో ప్రయాణించేందుకు అనుమతించాలని కోరింది. 


బస్సులు, రైళ్ల సదుపాయం లేకపోవడం వల్ల ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఉద్యోగులు రాలేకపోతున్నారని, ఫలితంగా ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని తెలిపింది. బస్సులు, రైళ్ల సదుపాయం పునరుద్ధరించాలని కోరింది. తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను వ్యాపారుల కోసం సడలించాలని కోరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వివిధ వస్తువుల సరఫరాదారులకు బిజినెస్ ఈ-పాస్‌లను జారీ చేయాలని కోరింది.


Updated Date - 2020-08-05T22:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising