కోవిడ్-19పై ఎయిమ్స్ డైరెక్టర్‌తో గుజరాత్ సీఎం రూపానీ చర్చలు
ABN, First Publish Date - 2020-05-10T00:22:47+05:30
గుజరాత్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
గాంధీనగర్ : గుజరాత్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం ఎయిమ్స్ (అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, డాక్టర్ మనీశ్ సునేజా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అంతకుముందు డాక్టర్ గులేరియా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో వైద్యులను కలిశారు. కోవిడ్-19 చికిత్సపై సలహాలు ఇచ్చారు.
మన దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు డాక్టర్ గులేరియా, డాక్టర్ సునేజా ఈ నెల 8న గుజరాత్ వచ్చారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి, ఎస్‌వీపీ ఆసుపత్రి వైద్యులకు కోవిడ్-19 చికిత్సపై సలహాలు ఇచ్చారు.
Updated Date - 2020-05-10T00:22:47+05:30 IST