ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్: ఏబీవీపీ, టీఎంసీపీ మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2020-12-11T21:39:28+05:30

గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరగడంతో రాష్ట్రంలో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. కొంత కాలంగా ఇరు పార్టీల మధ్య గొడవలు, కుమ్ములాటలు మామూలు అయిపోయాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఘర్షణ గురించి ప్రతిరోజు ప్రధాన మీడియాలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాగా. , ఇది రోజు రోజుకూ మరింత విపరీతమవుతోంది. తాజాగా ఇరు పార్టీల విద్యార్థి విభాగాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, తోపులాట తీవ్రరూపం దాల్చింది.


కో‌ల్‌కతాలోని గోబర్దంగా హిందూ కాలేజీకి భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు ఊరేగింపుగా వచ్చారు. అయితే వీరిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం తృణమూల్ ఛాత్రా పరిషత్ సభ్యులు అడ్డుకున్నారు. అంతే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తోపులాట వరకూ వెళ్లింది.


గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి జరగడంతో రాష్ట్రంలో పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. కొంత కాలంగా ఇరు పార్టీల మధ్య గొడవలు, కుమ్ములాటలు మామూలు అయిపోయాయి. ఇది విద్యార్థి సంఘాల వరకూ పాకింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనే భయాలు స్థానికుల్లో నెలకొన్నాయి.

Updated Date - 2020-12-11T21:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising