ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండుతున్న ఎండలు.. దేశంలో అత్యధికం ఎక్కడంటే?

ABN, First Publish Date - 2020-05-27T03:38:39+05:30

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఓ పక్క ఆంఫన్ తుఫాను విజృంభిస్తుంటే, మరోపక్క మాత్రం భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఓ పక్క ఆంఫన్ తుఫాను విజృంభిస్తుంటే, మరోపక్క మాత్రం భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో దేశంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల వివరాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 50డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. అదే సమయంలో ఢిల్లీలోని పాలమ్‌లో 47.6డిగ్రీలు నమోదైందని తెలియజేశారు. ఇది దేశంలో రెండో అత్యధికం. పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, దక్షిణ హరియాణా, ఢిల్లీ, దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, విదర్భ తదితర ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2020-05-27T03:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising