ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రత్యేక కోచింగ్ సిటీ’’.... మేనిఫెస్టో‌ను విడుదల చేసిన చిరాగ్

ABN, First Publish Date - 2020-10-21T18:33:28+05:30

ఎన్నికల నేపథ్యంలో ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘బిహార్ ఫస్ట్... బిహారీ ఫస్ట్’ అన్న నినాదాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : ఎన్నికల నేపథ్యంలో ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘బిహార్ ఫస్ట్... బిహారీ ఫస్ట్’ అన్న నినాదాన్ని నేడు ప్రజల ముందు ఉంచుతున్నా. నేడు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారం అని చెబుతున్నా.’’ అని చిరాగ్ ప్రకటించారు. నాలుగు లక్షల మంది ప్రజల్ని సంప్రదించిన తర్వాతే... ఈ మేనిఫెస్టోను ప్రకటిస్తున్నామని తెలిపారు. ‘‘అనేక ఇబ్బందులను చీల్చుకుంటూ బయటికి రావాలి’’ అని తన తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారని, ఇప్పుడు అలాగే వచ్చానని ఆయన తెలిపారు. సీఎంగా ఉన్న కాలంలో నితీశ్ సాధించిన విజయాలేవీ లేవని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలనే, తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. 

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

1. ప్రత్యేకంగా ఓ కార్మిక శాఖ ఏర్పాటు. దీని ద్వారా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న కార్మికులను దీని ద్వారా సంప్రదించవచ్చు.

2. బిహారీ యువత ఇతర రాష్ట్రాలకు చదువుల నిమిత్తమై వెళ్లకుండా... రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటు

3. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఏమాత్రం బాగోలేదు. వైద్యులు అందుబాటులో లేరు. వైద్యశాఖలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై దృష్టి పెడతాం.

4. నదుల అనుసంధానంపై దృష్టి పెడతాం. దీని ద్వారా వరదలు, కరువును అధిగమించవచ్చు.

5. ప్రత్యేక రాష్ట్ర హోదా పొందడానికి కృషి

6. పెట్టుబడిదారుల సమ్మేళనం ఏర్పాటు చేస్తాం. భూ సంస్కరణలకు ప్రాధాన్యం

7. ధార్మిక పర్యాటకాన్ని మరింత విస్తరిస్తాం. 

8. ఇతర రాష్ట్రాలకు కోచింగ్ నిమిత్తమై వెళ్లకుండా... ‘‘కోచింగ్ సిటీ’’ ఏర్పాటు


Updated Date - 2020-10-21T18:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising